14 May, 2026 | 1:40 AM

రెండు ట్రాక్టర్లు ఢీ..

14-05-2026 12:00 AM

అసిస్టెంట్ ఆర్టీఓ శ్రీకాంత్ రెడ్డికి స్వల్ప గాయాలు

కోహెడ, మే 13: ఇసుక, వరి ధాన్యం లోడు ఉన్న రెండు ట్రాక్టర్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొట్టుకున్న సంఘటన బుధవారం శనిగరం రాజీవ్ రహదారి పై జరిగింది. ఈ సంఘటన లో సిద్దిపేట అసిస్టెంట్ ఆర్టీఓ శ్రీకాంత్ రెడ్డి కి స్వల్ప గాయాలు అయ్యాయి. తంగళ్లపల్లి ఐకేపీ వరి ధాన్యం కేంద్రం నుంచి వడ్ల లోడ్ తో  మిల్లు కు వెళుతున్న ట్రాక్టర్ ను శనిగరం చౌరస్తా సమీపంలోని పాల్లోటి ప్రైవేట్ స్కూల్ ఎదుట ఇసుక ట్రాక్టర్ లోడ్ తో వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

ఐకేపీ కేంద్రాలకు పంపిచెందుకు లారీలను ఆపేందుకు రోడ్డు పక్కన తన వాహనం పెట్టి డ్యూటీ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి పై, పోలీస్ ల పై వరి ధాన్యం బస్తాలు పడటం తో స్వల్పంగా గాయాలైయాయి. బాధితులను చికిత్స కోసం సిద్దిపేట కు తరలించినట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రోడ్డు పై పడ్డ ధాన్యం బస్తాలను హమాలీల ద్వారా తొలగించి.. ట్రాక్టర్ లో లోడ్ చేసి మిల్లు కు తరలించినట్లు ఏపీఎం పేర్కొన్నారు.