12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

యువ రైతు ప్రాణం తీసిన ధరణి

09-08-2024 01:02 PM

జక్రాన్ పల్లి: ధరణి పోర్టల్ ఆ యువ రైతు ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో శుక్రవారం చోటుచేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాలేదని మనస్థాపంతో యువ రైతు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ. 12 లక్షలు నష్టపోయాడు. తనకున్న 2 ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని ప్రయత్నించాడు. కానీ ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. రాజేశ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.