వడదెబ్బతో రైతు మృతి
- ధాన్యపు కుప్పపైనే తుదిశ్వాస
- రంగారెడ్డి జిల్లా రాయపోల్‌లో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, మే 3 (విజయక్రాంతి): వడదెబ్బ తగిలి రైతు ధాన్యపు కుప్ప పైనే ప్రాణాలు విడిచిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. రాయపోల్ గ్రామానికి చెందిన రాపోలు మంగలి గౌర య్య (63) అనే రైతు ఆదివారం తన ధాన్యాన్ని విక్రయించేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ధాన్యా న్ని ఆరబోస్తూ, వడ్లు నేర్పుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి ధాన్యం రాశిపైనే పడిపో యాడు.
గమనించిన తోటి రైతులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, తీవ్రమైన వడదెబ్బ కారణంగా ఆయన అప్పటికే మృతి చెందా డు. ఈ ఘటనపై తోటి రైతులు, ప్రజా సం ఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ నుంచి రక్షణ పొందేందుకు నీడ సౌకర్యం, కనీస తాగునీటి వసతులు కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాం డ్ చేస్తున్నారు.






