11-03-2025 07:30:12 PM
రాజంపేట,( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని తలమడ్ల గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్(Electric Shock) రైతు మృతి(Farmer Dies) చెందిన సంఘటన చోటు చేసుకుందని ఎస్ఐ తెలిపారు. రాజంపేట ఎస్ఐ పుష్ప రాజ్(Rajampet SI Pushpa Raj) తెలిపిన వివరాల ప్రకారం.. తలమడ్ల గ్రామానికి చెందిన పెట్టిగాడి రామచంద్రం సుమారు వయసు (61) మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో నీరు పారించడానికి బోర్ స్టాటర్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. పొలానికి వెళ్లిన అతను ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ప్రమాదవశాత్తు బోరుమోటారు వద్ద విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.