11-05-2025 02:32:56 PM
మంత్రి శ్రీధర్ బాబు కు కిషన్ జీ వినతి పత్రం
మంథని, (విజయక్రాంతి): తనకు పార్టీ లో కానీ ప్రభుత్వంలో కానీ ఏదైనా పదవి ఇప్పించండి సార్ అంకితభావంతో పనిచేస్తానని ఆదివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు( Minister Sridhar Babu) కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ బిసి నాయకుడు గోటికారి కిషన్ జీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ జీ మాట్లాడుతూ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాద రావు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఇప్పటిదాకా పనిచేస్తున్నానని, తనకు ఇప్పటివరకు పార్టీలో గానీ ప్రభుత్వం లో ఎలాంటి పదవి పొందలేదని, మంత్రి శ్రీధర్ బాబు కు తనపై ఎంతో నమ్మకం ఉందని, తనను గుర్తించి తనకు ప్రాముఖ్యత ఉన్న పదవి అప్పగించాలని వినతి పత్రం ఇచ్చానని కిషన్ జీ తెలిపారు.