11-05-2025 03:02:16 PM
మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్
మంథని,(విజయ క్రాంతి): మంథని పరిసర ప్రాంత ప్రయాణికులకు కోసం సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాట్లు మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్(Manthani RTC Depot Manager Shravan Kumar) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 వ తేదీ నుండి 26 వ తేదీ వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా మంథని బస్టాండ్ నుండి కాళేశ్వరం కు ప్రతి రోజు 10 ప్రత్యేక బస్సులు నడుపుతున్నమని, మంథని నుండి కాళేశ్వరం ఫుల్ టికెట్ రేటు రూ. (140) ఆఫ్ టికెట్ (70)గా నిర్ణయించబడిందని, మంథని ప్రాంత ప్రయాణికులు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు. అలాగే అ కాళేశ్వరుని కృపను కూడా పొందాలని,
మహాలక్ష్మి పథకం వర్తించును
మంథని నుండి కాళేశ్వరం వరకు ఆర్టీసి బస్సులో మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని మేనేజర్ తెలిపారు.