calender_icon.png 12 May, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీర జవాన్ కుటుంబానికి పవన్ వ్యక్తిగత సాయం

11-05-2025 12:47:14 PM

అగ్ని వీరుడికి అశ్రునివాళి

మురళీ నాయక్ భౌతికకాయానికి పవన్ నివాళులు

వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం ప్రకటన

సొంత నిధుల నుంచి పవన్ మరో రూ. 25 లక్షల సాయం

అమరావతి: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్(Brave soldier Murali Naik) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District), గోరంట్ల మండల, కళ్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్ , పలువురు శాసన సభ్యులతో కలసి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు.

మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయ్, శ్రీరాం నాయక్ నీ పవన్ కళ్యాన్ పరామర్శించారు. పుత్ర శోకంలో ఉన్న ఇరువురినీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం, ఐదు ఎకరాల పొలం, 300 గజాల స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతంగా మురళీనాయక్ కుటుంబానికి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదని ఆయన పేర్కొన్నారు.