calender_icon.png 12 May, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'బ్రహ్మోస్‌' శక్తి ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు

11-05-2025 02:23:47 PM

లక్నో: పాకిస్తాన్‌తో సైనిక ఉద్రిక్తతల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) ఆదివారం లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌(Brahmos Supersonic Cruise Missile Unit)ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సౌకర్యం ఏటా 80 నుండి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయడానికి రూపొందించబడింది. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. బ్రహ్మోస్(Brahmos) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్(Supersonic cruise) క్షిపణులలో ఒకటని  రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బ్రహ్మోస్ కేవలం ఒక ఆయుధం కాదు, అది దానికదే ఒక సందేశమని పేర్కొన్నారు. మన సరిహద్దులను కాపాడుకోవడంలో మన అచంచల నిబద్ధతకు సందేశమన్నారు. తాను లక్నో ఎందుకు రాలేకపోయానో మీ అందరికి తెలుసన్నారు. ఇదే రోజున శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేశారు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను పూర్తిచేశారు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్‌ సిద్ధం చేసిన వారికి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు.

బ్రహ్మోస్‌ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి

బ్రహ్మోస్ తయారీ యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) పాల్గొన్నారు. బ్రహ్మోస్ శక్తిని ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ అందరూ చూసే ఉంటారని యోగి పేర్కొన్నారు. బ్రహ్మోస్ శక్తి గురించి తెలియకపోతే.. పాక్ ప్రజలను అడగండన్నారు. ఏ ఉగ్రదాడినైనా యుద్ద చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇప్పటికే ప్రకటించారని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకూ సమస్యపరిష్కారం కాదని యోగి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి భారత్ సందేశం ఇచ్చిందని యూసీ సీఎం అన్నారు. యూపీలో రూ. 300 కోట్ల ఖర్చుతో బ్రహ్మోస్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు యోగి ప్రభుత్వం 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.