calender_icon.png 12 May, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. ఏడుగురు మహిళలు సేఫ్

11-05-2025 12:30:46 PM

హైదరాబాద్: మేడిపల్లి పోలీసులు, రాచకొండ పోలీసుల ఏహెచ్‌టీయూ(Anti-Human Trafficking Unit) యూనిట్ తో కలిసి చెంగిచెర్ల వద్ద ఉన్న ఒక స్పా సెంటర్ పై దాడి చేసి, ఒక నిర్వాహకుడు, ఒక కస్టమర్ ను పట్టుకుని వ్యభిచారంలోకి దింపబడుతున్న ఏడుగురు మహిళలను రక్షించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు(Medipalli Police), ఏహెచ్‌టీయూ యూనిట్ సంయుక్త బృందం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో ఉన్న షుగర్ స్పా సెంటర్ పై దాడి చేసి, అంబర్ పేట్ కు చెందిన పల్లవి అనే నిర్వాహకురాలిని పట్టుకున్నారు. పోలీసుల ప్రకారం.. పల్లవి మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ, కస్టమర్లను ఆకర్షించింది. ఆమె కస్టమర్ల నుండి భారీగా వసూలు చేసి, బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడిన మహిళలకు చిన్న మొత్తాలు చెల్లించిందని పోలీసులు తెలిపారు. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్ కు తరలించారు. నిర్వాహకురాలు పల్లవి, ఒక కస్టమర్ ను జైలుకు పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.