11-05-2025 02:59:59 PM
పాక్ పౌరులపై భారత్ దాడులకు పాల్పడలేదు
న్యూఢిల్లీ: కాశ్మీర్ పై ఉగ్రవాదులు దాడి చేసి పలువురి సిందూరం చెరిపేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా బాధిత కుటుంబాలకు భారత సైన్యం న్యాయం చేసిందని ఆయన వెల్లడించారు. సైన్యానికి దేశం కృతజ్ఞతలు తెలియజేస్తుందని రక్షణమంత్రి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సైనిక చర్య మాత్రమే కాదు.. భారత శక్తికి చిహ్నమని రాజ్ నాథ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల మౌలికసదుపాయాలను కూల్చివేశామని ఆయన వివరించారు.
పాకిస్థాన్ పౌరులపై(Pakistani civilians) భారత్ దాడులకు పాల్పడలేదని వెల్లడించారు. పాక్ సైన్యం మాత్రం భారత పౌరులతో పాటు.. ఆలయాలపైనా దాడి చేసిందని రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఆరోపించారు. అటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ అధునాతన క్షిపణి భారతదేశ పెరుగుతున్న రక్షణ పరాక్రమం, సాంకేతిక బలానికి చిహ్నంగా అభివర్ణించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు ప్రారంభోత్సవ సమయం ప్రతీకాత్మక ప్రాముఖ్యతను సూచిస్తుందన్నారు.