వ్యవస్థ నిర్లక్ష్యానికి రైతన్న బలి!
భారతదేశం వ్యవసాయాధారిత దేశమని మనం గర్వంగా చెప్పుకొంటాం. దేశ జనాభాలో దాదాపు 45 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి వ్యవసాయమే ప్రధాన ఆధారం.
అయినప్పటికీ దేశానికి అన్నం పెట్టే రైతు నేడు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. పం టలు పండిస్తున్నాడు కానీ, లాభాలు రావ డం లేదు. ఉత్పత్తి పెరుగుతోంది కానీ, ఆదాయం పెరగడం లేదు. వ్యవసాయం కొనసాగుతోంది కానీ, రైతు జీవితం స్థిరపడటం లేదు. ఇది రైతు సమస్య మాత్రమే కాదు; దేశ భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ సమస్య.
రైతు జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న మరో అంశం గిట్టుబాటు ధరలు. ప్రభుత్వాలు కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ, ప్రతి రైతు ఆ ధరకు తన పంటను విక్రయించలేకపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల కొరత, తేమ నిబంధనలు, గన్నీ సంచుల లభ్యత లేకపోవడం, రవాణా సమస్యలు, చెల్లింపుల జాప్యం రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
దేశవ్యాప్తంగా గత రెండు దశాబ్దా ల్లో వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్, విద్యుత్, వ్యవసాయ యంత్రాలు, కూలీల వేతనాలు అన్నింటి ధరలకు రెక్కలొచ్చాయి. ఒక ఎకరం వరి సాగుకు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. పత్తి, మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటల్లో పెట్టుబడి మరింత అధికంగా ఉంటుంది. అయితే రైతు తన ఉత్ప త్తిని విక్రయించే సమయంలో సరైన ధర దక్కడం లేదు. పంట కోతల సమయంలో ధరలు పడిపోతున్నాయి. నిల్వ సదుపాయాలు లేక రైతు తక్షణ అవసరాల కోసం తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. వినియోగదారుడు అధిక ధర చెల్లిస్తున్నప్పటికీ, ఆ మొత్తంలో రైతుకు చేరే వాటా చా లా తక్కువగా ఉండటం వ్యవసాయ మా ర్కెట్ వ్యవస్థలోని అతిపెద్ద లోపం.
గిట్టుబాటు ధరలెక్కడ?
రైతు జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న మరో అంశం గిట్టుబాటు ధరలు. ప్రభుత్వాలు కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ, ప్రతి రైతు ఆ ధరకు తన పం టను విక్రయించలేకపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల కొరత, తేమ నిబంధనలు, గన్నీ సంచుల లభ్యత లేకపోవడం, రవా ణా సమస్యలు, చెల్లింపుల జాప్యం రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన రైతు రో జుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మార్కె ట్లో పారదర్శకత లేకపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం కొనసాగడం రైతు ఆదాయాన్ని మరింత తగ్గిస్తోంది.
పీడిస్తున్న నకిలీ విత్తనాల బెడద
వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న మరో ప్రమాదం నకిలీ విత్త నాలు, పురుగుమందులు. మొలకలు సరిగా రాకపోవడం, పంట పెరుగుదల మందగించ డం, చీడపీడల నియంత్రణ విఫలం కావ డం వల్ల ఏటా మన దేశంలో వేలాది మంది రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒకసారి నకిలీ విత్తనం రైతు చేతికి చేరితే మొత్తం సీజన్ ప్రమాదంలో పడుతుంది. రైతు పెట్టుబడి మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక భద్రత కూడా దెబ్బతింటుంది. నకిలీ విత్తనాలు, మందులు వంటి ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం వల్ల అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది.
పంటల బీమాపై తగ్గిన విశ్వాసం
ప్రకృతి వైపరీత్యాలు, కరువు, అతివృష్టి, చీడపీడల కారణంగా రైతు నష్టపోయినప్పుడు పంట బీమా రక్షణగా నిలవాలి. కానీ, అనేక సందర్భాల్లో పరిహారం ఆలస్యంగా రావడం, నష్టాల అంచనాలో లో పాలు ఉండటం, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల బీమా పథకాలపై విశ్వాసం తగ్గుతోంది. పంట నష్ట పోయిన రైతుకు నెలల తర్వాత పరిహారం వస్తే ఆ సహాయం ప్రయోజనం కోల్పోతుంది. ప్రకృతి విపత్తు తర్వాత తక్షణ ఆర్థిక సహాయం అందేలా బీమా వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక కోణంలోనే చూడలేం
రైతు సమస్యలను కేవలం కోణంలో మాత్రమే చూడలేం. అప్పులు, పంట నష్టా లు, మార్కెట్ అనిశ్చితి, కుటుంబ బాధ్యతలు రైతుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, ఎప్పుడు వరదలు సంభవిస్తా యో చెప్పలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి కనిపిస్తోంది. దీనివల్ల రైతు ప్రణాళి కలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు ఎండిపోవడం, సాగునీటి కొరత రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. నీటి కోసం కొత్త బోర్లు వేయడం, విద్యుత్ ఖర్చులు పెరగ డం వల్ల వ్యవసాయం మరింత ఖరీదైన ప్ర క్రియగా మారుతోంది. ఈ క్రమంలోనే రై తుల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు సం క్షేమం అంటే కేవలం ఆర్థిక సహాయం కాదు. మానసిక ఆరోగ్య మద్దతు కూడా అంతే అవసరం.
పరిష్కార మార్గాలు ఇవి:
1. పంట వైవిధ్యం ఆధారిత సాగు: వరి, గోధుమల వంటి సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలు, నూనె గింజ లు, చిరుధాన్యాలను ప్రోత్సహించాలి. ప్ర భుత్వం క్రాప్ క్యాలెండర్ రూపొందించి రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అం దించాలి.
2. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు: చిన్న రైతులు సమూహాలుగా ఏర్పడి విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకే కొను గోలు చేయాలి. పంటలను నేరుగా మార్కెట్‌కు లేదా కంపెనీలకు విక్రయించే అవకా శం కల్పించడం ద్వారా దళారుల ఆధిపత్యాన్ని తగ్గించవచ్చు.
3.గోదాములు కోల్ స్టోరేజ్
సదుపాయాలు: ప్రతి మండలంలో గోదాములు, కోల్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి. రైతులు వెంటనే పంటను అమ్మాల్సిన పరిస్థితి లేకుండా నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ వంటి వేదికలను మరిం త బలోపేతం చేయాలి.
4. నీటి యాజమాన్యం సోలార్ వ్యవసాయం: వర్షపు నీటి సంరక్షణ, ఫామ్ పాండ్‌లు, డ్రిప్ ఇరిగేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలి. సోలార్ పంపుసెట్ల ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించి భూగర్భ జలాలను పరిరక్షించాలి.
5. డిజిటల్ వ్యవసాయం నాణ్యత నియంత్రణ: నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. రైతులకు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, చీడపీడల నియంత్రణ సూచనలు డిజిటల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి తేవాలి. వ్యవసాయం కేవలం ఉత్పత్తి కాదు, అది ఒక ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి. రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. రైతు బలపడితేనే గ్రామీణ భారత్ బలపడుతుంది. దేశాన్ని పోషిస్తున్న రైతును కాపాడటం కేవలం ప్రభుత్వ బా ధ్యత కాదు, దేశ బాధ్యత కూడా.
వ్యాసకర్త: తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, 85010 61659
డా. బి.కేశవులు






