భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం
సీఐ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన గిరిజన రైతు
సంగారెడ్డి, మే 24(విజయక్రాంతి): అన్నదమ్ముల భూ వివాదం ఆత్మహత్యకు దారి తీసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని సజ్జారావుపేట తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం సాయంత్రం గిరిజన రైతు జహీరాబాద్ సీఐ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించాడు. వివరాల్లో వెళితే.. సజ్జారావుపేట తండాకు చెందిన రైతు ఖీర్ తన అన్న మధ్య భూ వివాదం ఉందని తండావాసులు తెలిపారు. ఖీర్ అన్న తనకు ఉన్న భూమిని రియల్ వ్యాపారులకు కొన్ని రోజులు క్రితం అమ్మడు. కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు భూమిని సర్వే చేయగా తక్కువగా వచ్చింది.
తక్కువగా రావడంతో ఖీర్ వద్ద నుంచి భూమి ఇవ్వాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. రైతు భూమి ఇవ్వకపోవడంతో రియల్ వ్యాపారులు జహీరాబాద్ రూరల్ పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు రైతును పోలీసు స్టేషన్‌నుకు పిలిపిం చారు. సీఐ కార్యాలయ ఆవరణలో రియల్ వ్యాపారులు, ఖీర్ కుటుంబ సభ్యులు మధ్య గురువారం సాయంత్రం భూ వివాదంపై పంచాయతీ జరిగింది.
పంచాయితీలో పోలీసులు జోక్యం చేసుకొని భూమి ఇవ్వాలని బెదిరించడంతో అసహనానికి లోనైనా రైతు పురుగుల మందు తాగాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని సర్కార్ దవాఖానకు తరలించారు. అక్కడి చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని సంగారెడ్డికి సూచించారు. పోలీసులు, రియల్ వ్యాపారులు బెదిరించడంతోనే ఖీర్ పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు, తండా వాసులు తెలిపారు.
పోలీసుల ప్రమయం లేదు
జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సజ్జారావుపేట తండాకు చెందిన ఖీర్ పురుగుల మందు తాగిన విషయంలో పోలీసుల ప్రమయం లేదు. అన్నదమ్ముల మద్య భూ పంచాయతీ ఉంది. ఇరువర్గాలకు చెందిన వారు పోలీసు స్టేషన్‌కు రావడంతో బయట మాట్లాడుకోవాలని సూచించాము. బయట ఖీర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగినట్లు తెలిసింది. ఈ సంఘటన పై విచారణ చేస్తున్నాం.
రామ్మెహన్‌రెడ్డి, డీఎస్పీ జహీరాబాద్






