ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు
25-05-2024 01:13 AM
సిద్దిపేట అర్బన్, మే 24 : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై ఆన్ ఆఫ్ స్విచ్ మరమ్మ తులు చేపట్టాడానికి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. శుక్రవారం దినపత్రికలో ఆన్ ఆఫ్ స్విచ్‌కు రూ. 4వేలు అనే శిర్షీకతో ప్రచురితమైంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలం, గ్రామం విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హుటాహుటిన రైతులు తెచ్చిన సామగ్రితో ఆన్ ఆఫ్ స్విచ్‌కు మరమ్మతులు చేశారు. పది నెలలుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రచురించి సమస్యను పరిష్కరించిన విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.






