6 May, 2026 | 8:46 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

సీసీఐ కేంద్రాల్లో రైతులకు అన్యాయం

04-12-2024 01:33 AM

గగ్గలపల్లి కేంద్రం ఎదుట రైతాంగం ఆందోళన

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సీసీఐ కేంద్రాల్లో నిర్వాహకులు తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, పత్తి కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోయారు. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి  సీసీఐ కొనుగోలు కేంద్రం ఎదుట మంగళవారం వారు ఆందోళన చేపట్టారు.

పత్తిని రోజుల తరబడి కేంద్రం ఉండేలా చేసి, చివరకు దళారులు, ఫెర్టిలైజర్స్ దుకాణ యజమానుల పత్తి మాత్రమే కొంటున్నారని ఆరోపించారు. తుఫాన్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, దీంతో పత్తిలో కొంత తేమ చేరిందని వాపోయారు.

నిర్వాహకులు నాణ్యత నిర్ధారణను సక్రమం చేయడం లేదని ఆరోపించారు. దళారులు తెచ్చే పత్తిని మాత్రం ఎలాంటి షరతులు లేకుండానే మొదటి రకం నాణ్యత రేటు కట్టి కొంటున్నారన్నారు. దిక్కులేక తాము ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.