calender_icon.png 23 October, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

23-10-2025 04:25:37 PM

శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించి శాలువాతో సన్మానించి స్వామివారికి ప్రసాదాన్ని అందజేశారు. ఈనెల 31 నుండి వచ్చే నెల 5 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పూజారులు పాల్గొన్నారు.