7 May, 2026 | 2:59 AM

కాంగ్రెస్ అసమర్థతకు రైతులు బలి

07-05-2026 02:04 AM

సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా కొనుగోలుకు నొప్పేంటి?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో రైతుల మరణాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు అసమర్థతే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు ఆరోపించారు. పంట పండించిన రైతు ధాన్యం అమ్ముకునేందుకు కొను గోలు కేంద్రాలకు వస్తే, వారాల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎం దుకు వచ్చింది? అని ప్రశ్నించారు. సకాలంలో కొనుగోళ్లు జరపాల్సిన కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని విమర్శించారు.

వానొస్తే తడవకుండా టార్పాలిన్లు కప్పే క్ర మంలో గోడలు కూలి, షెడ్లు పడి రైతన్నలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో గాలివా న బీభత్సంతో ధాన్యం కల్లాల వద్ద ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం తన మనసును కలిచివేసిందన్నారు. చనిపోయిన గుం డారపు వెంకటేష్, తనుగుల అభిరాం, లచ్చ న్న కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే జరిగాయని ఆరోపించారు.

క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర, మండీ హ మాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మరీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చే సేందుకు నొప్పేంటి..? అని ఘాటు వ్యాఖ్య లు చేశారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కా రు కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.

చనిపోయిన రైతుల కుటుంబాలకు వెంటనే భారీ పరిహారం అందించి, ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. రైతు బతికితేనే దేశం బతుకుతుంది..ఈ సత్యాన్ని కాంగ్రె స్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. కొండా సురేఖ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారు ఎలా దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతారని ప్రశ్నించారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాంచందర్ రావు మీడియాలో స్పందిస్తూ హిందూ దేవుళ్లపై నమ్మకం లేనివారు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.