నానో ఎరువులపై రైతులకు అవగాహన
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామంలో ఐఎఫ్‌ఎఫ్‌సీవో ఆధ్వర్యంలో నానో ఎరువులపై అవగాహన సద స్సు, వేప మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇఫ్కో మార్కెటిం గ్ డైరెక్టర్ డా. యోగేంద్ర కుమార్, ములకనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎస్. హుస్సేన్, ఇఫ్కో తెలంగాణ మార్కెటింగ్ మే నేజర్ ఎం.ఆర్. కృపాశంకర్ తదితరులు పా ల్గొన్నారు.
రైతులకు నానో యూరియా, నానో డీఏపీ, నానో జింక్ తదితర నానో ఎ రువుల వినియోగం, తక్కువ ఖర్చుతో పంటలకు పోషకాలను అందించే విధానాలపై అవగాహన కల్పించారు. యోగేంద్ర కుమా ర్ మాట్లాడుతూ ఇఫ్కో ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. నానో ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ బీమా యోజ న’ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. రైతులు సహకార స్ఫూర్తితో సమిష్టిగా పనిచేసి పంటల ఉత్పత్తి, మార్కెటింగ్లో మెరుగైన ఫలితాలు సాధించాలని అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సూచించారు. అనంతరం వేప, పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.






