శాస్త్రీయ సాగుపై రైతులకు అవగాహన
మొయినాబాద్, ఆగస్టు 13(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలం శ్రీరామ్నగర్లో ఆత్మ ఆధ్వర్యంలో అర్పీఎల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ సమగ్ర పోషక యాజమాన్యం , నీటి యాజమాన్యం, మల్చింగ్, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంతోష్నగర్కు చెందిన డా. ఏ. గోపాలకృష్ణరెడ్డి, రైతు శిక్షణ కేంద్రానికి చెందిన రజియా, కిరణ్మయి రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులను వివరించారు.
నేల పరీక్షల ప్రాధాన్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, నీటిని పొదుపుగా వినియోగించడం, మల్చింగ్తో నేలలో తేమను కాపాడుకోవడం, సేంద్రియ పద్ధతులతో సాగు వ్యయాన్ని తగ్గించుకోవడంపై సూచనలు ఇచ్చారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ, ఏవోఓ లు ఈ. దీనా, కె. శ్రీనివాస్, సర్పంచ్ మహిపాల్, ఆత్మ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






