శంకర్‌పల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం
శంకర్‌పల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): మన త్రివర్ణ పతాకం, మన జాతీయ గౌరవానికి ఐక్యతకు, దేశభక్తి స్పూర్తికి ప్రతీక అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద, చైతన్య, జాగృతి కళాశాలల విద్యార్థిని, విద్యార్థులతో బిజెపి నాయకులు కలిసి గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా జాతీయ జెండాలతో వందేమాతరం నినాదాలతో ప్రధాన చౌరస్తా వద్ద ముగిసింది.
కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యుడు రాములు గౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి,శ్రీకాంత్, సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు.






