28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రైతులు పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థిక అభివృద్ధి

12-12-2025 02:03 AM

పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్న శాస్త్రవేత్తలు 

గరిడేపల్లి, డిసెంబర్ 11: పేద, మధ్యతరగతి రైతులు పెరటి కోళ్ల పెంపకంతో షెడ్యూల్ కులాలకు చెందిన రైతులు ఆర్థిక అభివృద్ధిని పొందవచ్చునని కె.వి.కె ఇంచార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి నరేష్ అన్నారు.మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఐ సి ఏ ఆర్ అటారి హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో షెడ్యూల్ కులాల రైతులకు పెరటి కోళ్లను (రాజశ్రీ) గురువారం ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద రైతులకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అన్నారు.పెరటి కోళ్ల పెంపకం తో కుటుంబ సభ్యులకు రోజువారి ఆహారంలో మాంసకృతులు లభించడమే కాక పోషకాహార లోపాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు.వీటి గుడ్ల ఉత్పత్తి, మాంసపు ఉత్పత్తిని సాధించడంతోపాటు పోషకాహారాన్ని పొందటమే గాక వాటిని అమ్మడం ద్వారా ఆర్థికంగా ఎదగవస్తున్నారు.కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎం సుగంది,శాస్త్రవేత్తలు సిహెచ్ నరేష్,మోతే మండలానికి చెందిన గ్రామ మహిళలు,50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.