12-12-2025 02:03:59 AM
లైబ్రరీ ఏర్పాటు చేస్తా...
యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తా...
ఇల్లంతకుంట, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేరెళ్ళ విజ య్ అన్నాడు. విద్యావంతుడు, యువకుడు అయిన విజయ్ కు మద్దతుగా గ్రామస్థులు అందరూ ఏకమై పర్స్ గుర్తుపై ఓటు వేసి భా రీ మెజారిటీతో గెలిపిస్తామని వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
విజయ్ మాట్లాడుతూ గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి, సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల కు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. గ్రామంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పిస్తానని, బస్టాండ్ ఆవరణలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాననితెలిపారు.