శిశు మందిర్లో రైతు దినోత్సవం
నిర్మల్,(విజయక్రాంతి): స్థానిక పాఠశాల అయినా శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవారపేట్ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యవసాయ పనుల వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అన్నారు.
ప్రధానాచార్యులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నాన్ని వృధా చేయకూడదని అలా వృధా చేసినట్లయితే భవిష్యత్తులో ధాన్యాల కొరత ఏర్పడుతుందని తెలియజేశారు. రైతులు పడే కష్టాలు పంటలు పండించే విధానాలను గురించి తెలియజేశారు. తదనంతరం విద్యార్థులు వారి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్యులు, పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలియజేశారు.






