23-12-2025 04:18:31 PM
భద్రాచలం,(విజయ క్రాంతి): స్థానిక సెయింట్ పాల్స్ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి సెయింట్ ఫాల్స్ 34వ సెమీ క్రిస్మస్ , వార్షికోత్సవ సంబరాలు అంబురన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవరెండ్ డాక్టర్ ఎస్ పాల్ రాజ్, బిషప్ కటాక్షమ్మ పాల్ రాజ్ ఉన్నత ఆశయమైన భద్రాచల గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే క్రమంలో 1992 సంవత్సరంలో అలీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా సెయింట్ పాల్స్ పాఠశాలను స్థాపించి దాని ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన చేశారన్నారు.
ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధన చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన ఆశయాలు సాధన కోసం ప్రస్తుత పాఠశాల యాజమాన్యం డాక్టర్ కె అబ్రహం, డాక్టర్ కె రాధా మంజరి గత 34 సంవత్సరాలుగా విద్యా అభివృద్ధికి తోడ్పడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడేలా కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా నిరతినీ కొనసాగిస్తూ ఉన్నత స్థాయికి పాఠశాల పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆ ఆకాంక్షించారు. క్రీస్తు పుట్టుక దాని ప్రాముఖ్యతను క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తగిన ప్రతిభ పురస్కారాలు మెమొంటోలు అందించారు. అలాగే 2025 - 26 సంవత్సరానికి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు మెమొంటోను ఎస్.కె సోంద్ పాషా కు అందించి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో విద్యార్థులకు ప్రోత్సహించిన తల్లితండ్రులకు, సహకరించిన ఆధ్యాపక మరియు ఆధ్యాపకేతర బృందాలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్లు శ్రీ ఎస్ రాజేష్ మరియు డాక్టర్ కే అలీనా శాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.