calender_icon.png 23 August, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపిక చేసిన భూములలో రైతులు ఎలాంటి సాగు చేయవద్దు

16-12-2024 06:18:39 PM

మంథని ఆర్డీఓ సురేష్...

మంథని (విజయక్రాంతి): జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఎంపిక చేసిన భూములలో రైతులు ఎలాంటి సాగు చేయవద్దని మంథని ఆర్డీఓ సురేష్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. మంథని డివిజన్ లోని ముత్తారం (మంథని) మండలంలోని ముత్తారం, ఓదెడు, కేశనపల్లి, అడవిశ్రీరాంపూర్, పోతారం, సర్వారం, మైదంబండ, లక్కారం, శుక్రవారంపేట గ్రామాలలో జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ జరిగిందని, ఈ భూసేకరణకు గాను పరిహారం విషయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వద్ద ఆర్బీటేషన్ నిర్ణయించనైనదని, ఈ ఆర్బీటేషన్ పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని, కావున ఆయా 9 గ్రామాలలో రహదారి నిర్మాణానికి ఎంపిక చేసిన భూములలో రైతులు ఎలాంటి సాగు చేయవద్దన్నారు. గతంలో మండల వ్యవసాయ అధికారి, తహశీల్దార్ ముత్తారం తెలియజేశారని, ఈ పంట కాలంలో రహదారి నిర్మాణానికి ఎంపిక చేసిన భూములలో రైతులు ఎలాంటి సాగు చేయవద్దని, మరొక్కసారి తెలుపుతున్నామని, ఈ భూసేకరణలో భాగంగా (ఎన్ హెచ్) అథారిటీ వారు సంబందిత 9 గ్రామాలలో తదుపరి చర్యలు చేబడుతారని, వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు.