23-08-2025 10:58:53 AM
మంగళూరు: కర్నాటక దర్మస్థలలో(Dharmasthala Mass Burial Case) మృతదేహాలను ఖననం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కర్ణాటకలోని ధర్మస్థలంలో సంచలనం సృష్టించిన 'సామూహిక ఖననం' కేసులో ఫిర్యాదుదారుడిని ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) అరెస్టు చేసింది. మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. రెండు దశాబ్దాల్లో పలువురిని చంపినట్లు గతంలో పారిశుద్ధ్య కార్మికుడి తెలిపాడు. మృతదేహాలను ఖననంపై పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చినట్లు గుర్తించారు. పారిశుద్ధ్య కార్మికుడు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. ప్రభుత్వం, ప్రజలను పారిశుద్ధ్య కార్మికుడు తప్పుదారి పట్టించినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.
ధర్మస్థల కేసులో(Dharmasthala Case) బహుళ మృతదేహాలను ఖననం చేసినట్లు ఆరోపణలు రావడంతో, తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలపై ఫిర్యాదుదారుడు మాస్క్‌మ్యాన్ ను అధికారులు శనివారం ఉదయం 11 గంటలకు బెల్తంగడి కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి ఆగస్టు 22న ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 23న ఉదయం 5 గంటల వరకు ఫిర్యాదుదారుడిని తీవ్ర విచారణకు గురిచేశారు. విచారణ తర్వాత, ఫిర్యాదు అబద్ధమని నిర్ధారించబడింది. దీనితో అతని అరెస్టు జరిగింది. ఆగస్టు 23న ఈ కేసులో ఒక ప్రధాన పరిణామం జరిగే అవకాశం ఉందని సిట్ వర్గాలు సూచించాయి.