calender_icon.png 12 November, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్యపడొద్దు

19-05-2024 02:14:32 AM

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి, మే 18 (విజయక్రాంతి) : అకాల వర్షాలు, మిల్లుల్లో బండ్లు ఆన్‌లోడ్ కాకపోవడం కారణంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని రైతులు ఆందోళన చెందవద్దని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం ఆయన ఆలేరులో రైసు మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు, మిల్లర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద బియ్యం ఎఫ్‌సీఐ గోదాంలకు తరలించకపోవడంతో గత సీజన్ ధాన్యం మిల్లులలో పేరుకుపోయిందన్నారు.

అయినా మిల్లర్లతో కలెక్టర్‌తో ఎప్పటికిప్పుడు సంప్రదింపులు జరిపి ధాన్యాన్ని రవాణా చేస్తున్నారన్నారు. కేసీఆర్ రైతులను మభ్యపెట్టి ప్రభుత్వంపై దుష్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. దాదాపు 550 లారీలను ఏర్పాటు చేసి త్వరతిగతిన ధాన్యం మిల్లులకు రవాణా చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. వర్షాలకు తడిసినా ధాన్యం కొనుగోల్లు చేస్తారని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన వెంట యాదగిరిగుట్ట, ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం, అశోక్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.