సింగరేణి మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
సింగరేణి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం
కారేపల్లి సెప్టెంబర్ 1(విజయక్రాంతి): సింగరేణి మండల(Singareni Mandal) కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జన్మదిన వేడుకలను కారేపల్లి బస్టాండ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ధరావత్ కళ్యాణ్, భరోత్ కళ్యాణ్, బడుగుల శ్రీను, మొగిలిచర్ల రాంబాబు (కుమ్మరి), పురం రామరాజు, శ్రీను, పొగాకు సాయి, షేక్ నజీమ్, బొడ్డు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






