calender_icon.png 12 November, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృత్రిమ మేధ సాంకేతిక క్లబ్ ఆవిష్కరణ

19-05-2024 02:13:35 AM

రాజేంద్రనగర్, మే 18 (విజయ క్రాంతి) : కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడుతున్నదని అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శివ రుద్రరాజు, డార్విన్ సెంటర్ బీఈపీఎల్‌కు చెందిన ఉదయ్ అన్నారు. శనివారం గండిపేట్‌లోని ఎంజీఐటీలో కృత్రిమ మేధ సాంకేతిక క్లబ్ ఆవిష్కరించారు. విద్యార్థిని, విద్యార్థులకు కృత్రిమ మేధ విషయాలపై అవగాహన కల్పించారు. కళాశాల విద్యార్థులు వారి సందేహాలను సమావేశంలో నివృత్తి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమోహన్‌రెడ్డి, కళాశాల రిసెర్చ్ అడ్వైసర్ డాక్టర్ ఈశ్వర్‌ప్రసాద్, రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫణిరాజ్, కళాశాల వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.