06-02-2026 02:18:07 AM
మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకత్వంలో వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృథ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంతో శివప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయ మవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేట్రిక ల్ రిలీజ్‌కు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా పడ్డ ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి డీవోపీ: రసూల్ ఎల్లోర్; ఎడిటర్: సురేశ్ ఆర్స్.