06-02-2026 01:38:38 AM
బెల్లంపల్లి, ఫిబ్రవరి 5: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లోనూ రిజర్వేషన్లన్ని తారుమారయ్యాయి. ఇదే క్రమంలో ఔత్సాహికుల రాజకీయ భవిష్యత్తు, ఆకాంక్షలన్నీ ఒక్క సారి గల్లంతయ్యాయి. ఎక్కడ రిజర్వేషన్ కలిసి వస్తే అక్కడికి వెళ్లి పెద్ద లీడర్లు కొందరు పోటీ చేస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి లీడర్ల ఆశలు నీరుగారి పోయాయి. అంగబలం అర్థబలం ఉంటే సరి, ఏదైనా చేయొ చ్చు అనే తీరుగా వారి దూకుడు చర్చనీయాంశంగా మారింది. వీరి రాజకీయ కక్కుర్తిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని పలువురు బాటంగానే మాట్లాడుకుంటున్నారు.
ఆశావహుల ఆశలకు తూట్లు...
మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళ కావడంతో ఈ రకమైన రాజకీయ కక్కుర్తి ధోరణులు వెర్రి తలలు వేస్తున్నాయి. పెద్ద లీడర్ల, స్వార్ధ పూరిత ఆశయాలకే కాంగ్రెస్ లో ప్రాధాన్యతకు నోచుకుంటున్నాయన్న విమర్శలున్నా యి. చిన్న మధ్యతరహ గల్లీ లీడర్ల రాజకీయ ఆకాంక్షలు ఎవరికి పట్టకుండాపోయాయని వాపోతున్నారు. తమ ఎదుగుదలకు పెద్ద లీడ ర్లు ప్రధాన అడ్డుగోడగా మారిపోయారనీ ఆశావహులు నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంతకాలం పెద్ద లీడర్ల కోసం జెండా లు పట్టి జైకొట్టి ముందు ఉండే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఆత్మగౌరవం కోసం వారు ఆరాటపడుతున్నారనీ తెలుస్తోంది.. ఇప్పటికైనా తాము ఎదురు తిరగకపోతే రాజకీయ పురోగతికి దారులు గగనమని ఆశావ హు లంటున్నారు. పెద్ద లీడర్లే కౌన్సిలర్లు, చైర్మన్ పీఠం వారికే.. ఈ రీతిలో బిగ్ లీడర్ల రాజకీయ దురంకా రం, విపరీత బుద్ధులు మున్సి పల్ ఎన్నికల్లో సుస్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకాలం రాజకీయ బానిసలుగానే.., తామేప్పటికీ పెద్ద లీడర్ల సేవకులుగా ఉండాల్సిందేనా..? అనే స్పృహ ద్వితీయ శ్రేణి సమూహాల్లో కనిపిస్తోంది. ఈ అసంతృప్తులు, ఆవేదనలు వెరసి తిరుగుబాటు రూపంలో కాంగ్రెస్ విజయావకా శాలకు పెను సవాలుగా మారారని పరిశీలకు లు భావిస్తున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక అధికార కల రెబల్స్ వల్ల ప్రశ్నార్థకం కానుందని పరిశీలకులు అంచనావేస్తున్నారు.
రెబల్స్‌గా ఆశావహులు..
పార్టీలో ప్రాధాన్యత కోల్పోయిన పలువురు, టికెట్లు కోల్పోయిన సీనియర్ లీడర్లు, మాజీ కౌన్సిలర్లు చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేయడం, ప్రతికారం తప్ప మరోటి వారికి కనిపించడం లేదు. దీంతో రెబల్స్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ బెడద ముప్పుగా ఉందనీ తెలుస్తోంది.
అధిష్టానం ఒంటెత్తు పోకడలు, ఇతర ఎలక్షన్ ఫార్మాలిటీస్‌లో కూరుకుపోయి, కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలైనా కొందరు సీనియర్ లీడర్ల ఆశల కొమ్మలను తెగనరికి వేస్తు న్నారన్న అపవాదును మాత్రం ఎమ్మెల్యే గడ్డం వినోద్ మూట కట్టుకుంటున్నారు. ఏమి చేయ ని నిస్సహాయలుగా సీనియర్ లీడర్లు కొందరు రాజకీయంగా జీవన్మరణ దుస్థితికి చేరారు.
అంగబలం అర్ధబలం ఉన్నవారికి మాత్రమే మున్సిపల్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు అసంతృప్తి వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు టిక్కెట్లు కోల్పోయిన బాధ, మరోవైపు అధిష్టానంపై తిరుగుబాటుతో ఇంతకాలం సమకూర్చుకున్న రాజకీయ అస్తి త్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయిందనేది వారిని తీవ్రంగా వేధిస్తుంది.
కష్టపడి పార్టీ కోసం ఇంత కాలం పని చేసిన వారికి చివరికి రాజకీయ అవమానాలే మిగిలాయని, కాంగ్రెస్ లో సీనియర్ కేడర్ కు కనీస విలువ లేదనేది మరోసారి మున్సిపల్ ఎన్నికల వేల బయటపడిందని వాపోతున్నా రు. వారంతా చివరికి అసమ్మతి వాదాన్ని నెత్తినఎత్తుకున్నా రు. ఇంతకాలం తమ రాజకీయ జీవితాన్ని కోల్పోయి బలి పశువులుగా మిగిలిపోవడమే వారి వంతైందని అంతర్మథనంలో పడిపోయారు. చివరికీ రాజకీయ బానిసలు చేశారని పలువురు వాపోతున్నారు.
రాజకీయ రంగం లో బడుగు, బలహీన,మైనార్టీ, దిగువ శ్రేణులు అనాదీ నుంచి పెద్ద లీడర్ల ప్రయోజనాల కోసం రాజకీయ సమిధలవుతూనే ఉన్నారు. ఇప్పటికీ పార్టీల పల్లకి మోసుడే కానీ అది మోసిన వారికి రాజకీయ మోక్షం ఎన్నడూ అందనీ ద్రాక్షగానే మారిందనేది చరిత్ర చెప్పిన సత్యం.. ఇది రాజకీయ పార్టీల్లో ప్రతి అంశాల్లో రూడీ అవుతూనే ఉందని విశ్లేషకుల అభిప్రాయం రాజకీయాల్లో పెద్ద లీడర్లు ఏం చేసినా కరెక్టే.. రిజర్వేషన్లు కోల్పోయిన కొందరు లీడర్లు పక్క వార్డుల్లో పోటీ చేస్తున్నారు.
చీమల పుట్టల్లోకి పాముల్లాగా దూరిపోయారు. చిరకాలంగా పెట్టుకున్న వారి రాజకీయ అవకాశాలు, ఆకాంక్షలను ఒక్క పెట్టునా తుడిచిపెట్టారు. ఇలాంటి కప్పదాటు అనైతిక ఆధిపత్య ధోరణులతో తీవ్ర విమర్శలను మూట కట్టుకుంటున్నారు. అధికార దాహంతో ఎంతకైనా తెగిస్తారని మరోసారి నిరూపించుకున్నారన్న చర్చ జోరుగా జరుగుతుంది. వార్డుల సరిహద్దులు దాటి పోటీలోకి దిగి తాము ఏమి చేసినా చెల్లుతుందనే దురంకారంతో కళ్ళు మూసున్నారని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు.
సీనియర్ల ఆశలు గల్లంతు..
బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎత్తులు జిత్తులతో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. అధికార పక్షం పార్టీలో టిక్కెట్ల గోల చర్చనీయాంశంగా మారింది. టికెట్లు తెచ్చిన అసమ్మతి కాంగ్రె స్‌ను వణికిస్తుంది. మొదటి నుంచి పార్టీనీ పట్టుకొని పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యత లేదూ అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశం కాంగ్రెస్ ను నైతిక విమర్శలపాలు చేస్తుంది.
ఈ విష యం అనేక సందర్భాల్లో సీనియర్లపై వివక్షత వ్యక్తమైంది. వారు స్వయాన ప్రజలకు మీడియా ముందు నేరుగా అప్పీలు చేసినా దుష్టంతాలు కోకొల్లలు. అవి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరింత ముదిరి పోయాయి. ఎన్నికల వేళ ప్రధాన ఎజెండా కెక్కాయి. 34 వార్డుల్లో సీనియర్, జూనియర్లలో కొందరికి టిక్కెట్లకు ఎగనామం పెట్టారు.
నిర్లక్ష్యం, అశ్రిత పక్షపాతం పాదఘట్టం కింద నలిగిపోతున్నామని వాపోతు న్నారు. టికెట్ల ఖరారులో తప్పులతడక, గందరగోళం, అసంతృప్తులకు ఆజ్యం పోశా యి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్స్, ఆశావాదుల్లో అగ్గిరాజేస్తున్నాయి. నమ్మకద్రో హానికి బలై అగమ్యగోచరంలో నెట్టివేయబడ్డామని వాపోతున్నారు.