16 May, 2026 | 2:11 AM

గన్నీ బ్యాగుల కొరత.. రోడ్డెక్కిన అన్నదాత

16-05-2026 12:27 AM

బోథ్, మే 15 (విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న జొన్న పంట మొక్కజొన్న పంటలకు అవసరమైన గన్ని బ్యాగులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడంతో రైతులు తీసుకొచ్చిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బోత్ మార్కెట్ యార్డులో ఉన్న రైతులు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

బోథ్ బస్టాండ్ సమీపంలోని కోరమండల్ ఎరువుల దుకాణం ఎదుట రోడ్డుపై బైఠాయించారు దీంతో వాహనాల రాకపోకకు ఇబ్బందులు ఎదురయ్యాయి విషయం తెలుసుకున్న స్థానిక ఎస్త్స్ర ఆందోళన చేపడుతున్న రైతులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అంతేగాక జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామితో మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు .దీనితో రైతులు శాంతించారు. కాగా అధిక దిగుబడి వల్ల జొన్న పంట మొక్కజొన్న పంట మార్కెట్కు తీసుకురావడంతో స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి వాపోయారు.అధికారులు స్థానికంగా ఉన్న జిన్నింగ్ యజమానులతో మాట్లాడి అక్కడ రైతులు పంట వేసే విధంగా చూడాలని కోరారు.