8 మంది రైతులకు జరిమానా
- వరి కొయ్యలు కాల్చినందుకు రూ.5 వేలు చొప్పున విధింపు
- కథలాపూర్ మండలం రాజారాం తండాలో ఘటన
జగిత్యాల, జూన్ 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని రాజా రాం తండా గ్రామంలో వరి కొయ్యలను కాల్చి న ఎనిమిది మంది రైతులపై ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు గ్రామ పంచా యతీ సమక్షంలో జరిమానా విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చరాదని పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, గ్రామ పంచాయతీ ద్వారా కూడా వరి కొయ్యలు కాల్చకూడదని తీర్మానం చేశారు.
అయినప్పటికీ రాజారాం తండా గ్రామానికి చెందిన భూక్యా నంద్యా నాయక్, లకవత్ రాములు, లకవత్ భక్సయ్య, భూక్యా సంతోష్, కున్సోత్ రాజేష్, గావాత్ రాజు, లకవత్ తిరుపతి మరియు భానోత్ రాజు తమ వ్యవసాయ క్షేత్రాలలో వరి కొయ్యలను కాల్చినట్లు గుర్తించారు. దీనిపై కథలాపూ ర్ వ్యవసాయ అధికారి, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో విచారణ నిర్వహించి, ఒక్కొక్కరికి రూ.ఐదువేలు చొప్పున జరిమానా విధించారు.






