calender_icon.png 26 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ చేయాలని ధర్నా భారీగా తరలివచ్చిన రైతులు

26-08-2025 12:16:43 AM

మేడ్చల్, ఆగస్టు 25(విజయ క్రాంతి): పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఘట్కేసర్ మండల రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఘట్కేసర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్ల మీద తరలివచ్చారు.

ఈ సందర్భంగా అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఘట్కేసర్ సొసైటీలో 1189మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారు తెలిపారు. సొసైటీలో సంప్రదిస్తే అర్హుల జాబితా పంపామని చెబుతున్నారని, కానీ ఇంతవరకు మాఫీ జరగలేదన్నారు.

కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమందికి మాత్రమే మాఫీ చేసి ప్రభుత్వం అందరికీ మాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులందరినీ సంఘటితం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.