26-08-2025 12:17:03 AM
భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం సిద్దరామేశ్వరనగర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు 20 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.