26-08-2025 12:13:42 AM
మోతె, ఆగస్ట్ 25:- మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో సోమవారం జరిగిన గ్రామదేవత ముత్యాలమ్మ పండుగకు కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ప్రజలందారు పాడి పంటలు పండి ఆరోగ్యంగా, ఆర్థికంగా ప్రతి యేడు అభివృద్ధి చెందేలా చూడమని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పందిళ్ల పల్లి పుల్లారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల మధుసూదన్ రెడ్డి, ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేలుగు వీరన్న, మాజీ సర్పంచ్ మామిడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఏ ఐ డబ్ల్యూ సి ఐ టి సి ఎల్ సూర్యాపేట జిల్లా చైర్మన్ దోసపాటి చిరంజీవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఇదయ్య, గ్రామ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.