16 April, 2026 | 9:46 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రైతులకు భారీ శుభవార్త

27-06-2025 10:43 PM

అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..! 

పరిశీలించిన జిల్లా కలెక్టర్

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): వ్యవసాయ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్య దాన్యం లో తేమ శాతం ఎక్కువగా ఉండడం, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేందుకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అవగాహన లోపం, ధాన్యం వెంటనే మార్కెట్ కు తరలించాలనే ఆత్రుత తో రైతులు పంట కొత తర్వాత ధాన్యాన్ని నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు తరలించడం వల్ల తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే.

దీనివల్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి ఉంచి ఆరబెట్టాల్సి రావడం, ఈ సమయంలో వర్షం కురిస్తే తిరిగి ధాన్యం తడవడం ,ఇటు రైతులు, అటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని మనం చూస్తున్న విషయమే.ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాలను కొనుగోలు చేస్తున్నది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం 2 మొబైల్ గ్రైన్ డ్రయర్లను ఒక్కోటి రూ.14.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది. తాత్కాలికంగా వీటిని ఒకటి తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరొకటి మిర్యాలగూడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా తిప్పర్తి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సంచార గ్రైన్ డ్రయర్ యంత్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు.ఈ సందర్భంగా ధాన్యం తేమను ఆరబెట్టే యంత్రం పనితీరు, ప్రయోజనాలు,ఇబ్బందులు అన్ని విషయాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వెంటనే యంత్రం సరఫరా చేసిన ప్రతినిధులను పిలిపించి యంత్రం పని తీరును పరిశీలించి వచ్చే సీజన్ లో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఈ ధాన్యం తేమ ఆరబెట్టే యంత్రం తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయంలో 17 శాతానికితగ్గించే అవకాశం ఉంది. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, మార్కెటింగ్ సెక్రెటరీ శ్రీధర రాజు,తిప్పర్తి తహసిల్దార్, ఎంపీడీవో, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.