calender_icon.png 28 June, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు సీఐ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి

28-06-2025 12:00:00 AM

ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర 

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 27 (విజయ క్రాంతి)భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డ కు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను కౌన్సి లింగ్ కు పిలిస్తే కౌన్సిలింగ్ కు వచ్చిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఎటువంటి ఆధారాలు లేకుండా, ఏ చిన్న ఆరోపణలు లేకుండా నిజాయితీ గల ఇల్లందు సీఐ సత్యనారాయణ ను స స్పెండ్ చేయడం చాలా దారుణమని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర అన్నారు.

న్యాయం కోసం ఆశ్రయించే మహిళల పట్ల పోలీసు ఉన్నతాధికారులకు మోసపోయిన మహిళకు న్యాయం చేయకపోగా ఒక మోసగాడిని సపోర్ట్ చేస్తున్న ఈ పోలీసు ఉన్నతాధికా రు లను ఏం చేయాలో ప్రభుత్వాలే నిర్ణయించాలన్నారు.

సి.ఐ సత్యనారాయణ సస్పెన్షన్ పోలీస్ ఉన్నతాధికారుల తొందరపాటుగా తాము భావిస్తున్నామని, సి ఐ ఏజెన్సీ భద్రాద్రి జిల్లాలో కేసు ల విషయంలో మహిళాల విషయంలో ఎక్కడ పొరపాటు చేసిన దాఖలాలు లేవని, ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ గల వ్యక్తి అని,ఆయనపై సస్పెన్షన్ ఎంత మాత్రం సరి కాదని, వెంటనే సస్పెన్స్ ను ఎత్తివేసి,అక్కడే పోస్టింగ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.