28-06-2025 12:00:00 AM
చెరువులను తలపిస్తున్న రోడ్లపై మురుగునీరు..
కొత్తగూడెం జూన్ 26 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం మెయిన్ రోడ్ లో గల ఆటో స్టాండ్ ఆవరణలో,నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గత వారం రోజులుగా మురుగునీరు పేరుకుపోయింది. అయినప్పటికీ నగరపాలక సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రామవరం పట్టణం (విజయవాడ హైవే) నడిబొడ్డున ఇంతటి మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ లేక బస్టాండ్ ఆవరణ నుంచి కాళీమాత గుడి వరకు మురుగునీరు పేరుకుపోయి చెరువును తలపిస్తోంది. నగరపాలక సంస్థ సిబ్బంది చూస్తూ దాటుకుంటూ వెళ్తున్నారు తప్ప, మురుగునీరు పారద్రోలుటకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అటువైపుగా వెళ్లాలంటే ఆ బురదలోనే వాహనాలు నడపాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆ దారి గుండా నడవలేని దుస్థితి ఇప్పటికైనా,సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టిసారించి రోడ్డుపై మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటే దోమలు విద్యను మించి ప్రజల అనారోగ్య బారిన పడతారనీ భయాందోళన చెందుతున్నారు.