ఢిల్లీకి రైతుల పాదయాత్ర
పార్లమెంట్ ముట్టడికి ఛలో ఢిల్లీ కార్యక్రమం
కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పరిహారం కోసం యూపీ రైతుల డిమాండ్
అధికారుల హామీతో వారం రోజుల సమయం ఇచ్చిన రైతులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు సోమవారం ఢిల్లీ వైపు కదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు నోయిడా లోని మహామాయ ఫ్లుఓవర్ కింద నుంచి రైతులు పాదయాత్ర ద్వారా ట్రక్టర్ల మీద ఢిల్లీ కి బయల్దేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీకి వెళ్లే మార్గాలను అధికారులు బారికేడ్లతో మూసేశారు.
ఈ క్రమంలో రైతు లు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం రోడ్డుపైనే కూర్చొని ఆందోళనలు చేశారు. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సామాన్య జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారతీయ కిసాన్ పరిషత్(బీకేపీ), కిసాన్ మజ్దూర్ మో ర్చా(కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) సహా గౌతమ్ బుద్ధ నగర్, ఆగ్రా, అలీగఢ్ తదితర 20 జిల్లాలకు చెందిన రైతు లు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం బీకేపీ పార్లమెంట్‌ను ముట్టడించాలని పేర్కొంటూ ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్
యూపీ రైతులు పాదయాత్రకు బయల్దేరడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ స్థంభిం చింది. రైతులను అడ్డుకునేందుకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు బలగాలు మోహరించినప్పటికీ పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉండటంతో నోయిడా అధికారులు రైతు సంఘాల నేతలతో చర్చించారు. సమస్యలు పరిష్కరించడానికి అధికా రులు తమకు వారం రోజుల సమయం కావాలని కోరారు. దీనికి రైతులు అంగీకరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం చర్చించే ందుకు నోయిడాలోని దళిత ప్రేరణ స్థల్ వద్ద వేచి చూడనున్నట్టు ప్రకటించారు. దీంతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
రైతుల డిమాండ్లు ఇవే..
* పాత భూ స్వాధీన చట్టం ప్రకారం అభివృద్ధి చేసిన 10 శాతం ప్లాట్లను తమకు ఇవ్వాలని అడుగుతున్నారు.
* నష్టపరిహారాన్ని 64.7శాతం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
* 2014 జనవరి 1 తర్వాత భూమిని స్వాధీనం చేసుకుంటే 20 శాతం ప్లాట్లను ఇవ్వాలని కోరుతున్నారు.
* భూమిలేని రైతులకు వారి కుటుంబ సభ్యులకు ఉపాధి, పునరావాసం కల్పించాలి.
* హైపర్ కమిటీ ఆమోదించిన సమస్యలపై ప్రభుత్వ ఉత్తర్వులు, జనా వాస ప్రాంతాలకు సరైన పరిష్కా రం చూపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






