13 July, 2026 | 9:09 AM

సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం

03-12-2024 04:21 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం నేపథ్యంలో 12వ నంబర్ గదిలోని బెంచ్‌లో సోమవారం జరగాల్సిన విచారణలను నిలిపేశారు.