2 July, 2026 | 3:05 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

09-04-2025 01:06 AM

ఫార్మాసిటీ రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

 మక్కపల్లి స్వరూప, నక్కర్త  మేడిపల్లి  కోఆఫరేటివ్ డైరెక్టర్

 యాచారం ఏప్రిల్ 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మా సిటీ భూసేకరణ  కార్యక్రమం లో భూ బాధిత రైతులకు బారి నష్టం వాటిల్లిందని  భూములు ఇవ్వకుండానే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, రైతులను భయబ్రాంతులకు గురిచేసే పోలిసుల పహారాలో కంచే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 2013భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం నాలుగు వంతులు ఇవ్వాలని, భూముల పై ఆధారపడిన వృత్తి కూలాలకు నష్టపరిహారం చెల్లించాలని.డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన వారికి 121గజాల ఇంటి స్థలం వేంటనే పంపిణీ చేయాలని, భూములు ఇచ్చిన రైతుల  కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2200ఏకరాల భూములలో ఏలాంటి పనులు చేయవద్దని హైకోర్టు  వారి ఆర్డర్ వున్న దానిని ధిక్కరించి ఆధికారులు  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.పేర్కొన్నారు. పట్టా హక్కులు కలిగివున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని.ఉపయోగపడే పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.  వ్యవసాయ భూములలోఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మా కంపెనీలు స్థాపించడానికి కాకుండా  నిరుద్యోగులకు యువతకు ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు.