17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

తాటి ముంజలకు భలే గిరాకీ ఎగబడి తింటున్న జనం

09-04-2025 01:07 AM

కల్లూరు, ఏప్రిల్ 8 :-కల్లూరు మండలంలో తాటి ముంజలకు భాలే గిరాకీ ఏర్పడింది.ఎండాకాలం కావడం, రోజు రోజుకు ఎండ తీవ్రత అధికం అవుతుండడంతో తాటి ముంజులకు మరింత డి మాండ్ పెరిగింది. ముంజల్లోని నీరు, లోపలి గుజ్జు ఎంతో రుచిగా ఉంటాయి. ఎండ వేడిమి లో వీటిని తీసుకుంటే శరీరానికి చల్లదనమే కాకుండా మానసిక ఆనం దం కూడా లభిస్తుంది.

మండే ఎండల్లో ఆరోగ్యాన్ని కాపాడటంలో తాటి ముంజులు ఉత్తమమైనవి. ప్రకృతి ప్రసాదించిన ముంజ ల్లో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, బి, సి, ఐరన్,  ఉండ టంతో శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు వెలుపలికి వచ్చేలా చేస్తాయి. తరిమేస్తాయి.

నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది.. ఎండ వేడి తగిలినా వడదెబ్బ తగలకుండా మనిషిని కాపాడుతుంది. ముంజల్లో ఉండే పోటాషియం వల్ల  ఎన్నో ప్రయోజనాలున్నాయి.చెడు కొలస్ట్రాల్ పో యి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందడం ద్వారా గుండె ఆరోగ్యవంతంగా ఉండేలా చే స్తుంది. శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది.

ముంజుల వల్ల లివర్ సమస్యలు కూడా తొలగుతాయి. ముంజలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ రాకుండా చేస్తుం ది. వికారం, వాంతులను నివారిస్తుంది. వేసవిలో ఎక్కువగా వచ్చే పొంగు నుంచి శరీరా న్ని చల్లగా ఉంచుతూ ఉపశమనాన్ని ఇస్తుం ది. ఇంకెందుకు ఆలస్యం.. ముంజలను ఓ పట్టు పట్టండి.