తడిసిన ధాన్యం సేకరణపై రైతులు ఆందోళన చెందవద్దు
30-05-2026 12:00 AM
కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్ళపల్లి మే 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ సందర్శించి పరిశీలించారు. తడిసిన ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని వెల్లడించారు. వర్షంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని శాఖల సమన్వయంతో కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.






