30 May, 2026 | 2:47 AM

స్కూల్ బస్సులకు అన్ని అనుమతులుండాలి

30-05-2026 12:00 AM

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): అన్ని ప్రైవేట్ పాఠశాలలు స్కూల్ బస్సుల విషయంలో నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే శారు. బస్సులకు సంబంధించి రవాణా శాఖ నుంచి పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల ను కలిగి ఉండాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.