2 May, 2026 | 2:32 AM

రైతన్న ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

02-05-2026 01:29 AM

బోథ్, మే 1 (విజయక్రాంతి]: బోథ్ మండలం లోని పోచ్చర గ్రామానికి చెందిన నలుగురు రైతులకు చెందిన పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో జొన్న పంట పూర్తిగా దగ్దం అయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల భూముల్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు రూ. 9 లక్షల రూపాయల మేరకు నష్టం సంభవించింది.

పోచ్చర గ్రామానికి చెందిన గొండ్ల రమణ అనే రైతుకు చెందిన 7 ఎక రాల మొక్కజొన్న ఖాళీ బూడిద కావడంతో పాటు 20 పైపులు సంఘటనలో దగ్ధమ య్యాయి దీంతో రైతుకు ఏడు లక్షల రూపా యల మేరకు నష్టం సంభవించింది. అంతేగాక కంసాలి వెంకటి కి చెందిన 30 పైపులు, యాటకరి రమేష్ కు చెందిన 20 యాటకారి నారాయణ చెందిన 20 పైపులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.

చేతికి అందిన పంట ఖాళీ బూడిద కావడంతో గుండ్ల రమణ కుటుంబీకులు కన్నీరు అవుతున్నారు అయితే విషయం తెలుసు కున్న స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకు న్నారు. నష్టపోయిన రైతులు తమ గోడు వినిపించడంతో ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.

ఆందోళన చెందవద్దని, పంట నష్టపరిహారం వచ్చే విధంగా అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన తీరు గురించి రైతులను అడిగి తెలుసు కున్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక రైతులు నాయకులు ఉన్నారు