ఘనంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ శంకుస్థాపన
గరిడేపల్లి, మే 1: మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శివాలయంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఆలయ పూజారి కొంపెల్లి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని గ్రామస్తులు పూజారులు ఘనంగా నిర్వహించారు. మొదట ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు. గ్రామంలోని గ్రామస్తులందరూ కలిసి ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆలయ పూజారి గ్రామ పురోహితులు కొంపెల్లి కృష్ణ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య మాజీ ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, త్రిపురం అంజన్ రెడ్డి, మండాది వెంకయ్య, రావుల ముత్యాలు, పుట్ట బక్కయ్య, కొలిపాక రాము, వీరయ్య నర్సిరెడ్డి, అంజి పాల్గొన్నారు.






