22 April, 2026 | 12:04 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

కట్టలు తెగిన ఆగ్రహం.. కాంగ్రెస్ అధ్యక్షుడి కారుపై రాళ్ల దాడి

25-10-2024 12:13 PM

ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా ఆందోళన

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల దాడిలో మండల అధ్యక్షుడు ఆవిటి శేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఫార్మా విలేజ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు దాడి చేశారు. రోటిబండతండా పంచాయతీ భవనంలోకి ఆవిటి శేఖర్ ను తరలించారు. పంచాయతీ భవనంలో ఉన్న శేఖర్ పై దాడికి నిరసనకారులు ప్రయత్నించారు. పంచాయతీ భవనం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల లాఠీచార్జిలో పలువురు స్థానికులు గాయపడ్డారు. ఫార్మా విలేజ్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల ఆందోళనతో ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఉద్రిక్త పరిస్థితులతో అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.