13 August, 2026 | 8:52 PM

సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

13-08-2026 07:49 PM

సూపర్డెంట్ అవినాష్ 

బెజ్జూర్,(విజయక్రాంతి): సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సూపర్డెంట్ అవినాష్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వివరాలు, పలు రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

గతంలో ప్రసవాల సంఖ్య మెరుగుగా ఉందని, ప్రస్తుతం ప్రసవాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్రిటికల్ కేసులను మాత్రమే రెఫర్ చేయాలని, ఆరోగ్యవంతంగా ఉన్న  గర్భిణీలను సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలనతో హాజరుకావాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైద్యాధికారి శ్రావణ్ కుమార్, ఫార్మసిస్ట్ ఆయేషా వైద్య సిబ్బంది ఉన్నారు.