ధాన్యం తరలింపులో జాప్యం... మోకాళ్ళపై నిలబడి రైతుల నిరసన
29-05-2026 03:39 PM
బోథ్, మే29(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో దాన్యము కొనుగోలు తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తపరిచారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్(Former MPP Thula Srinivas) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ... ధాన్యం తరలించడంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది అన్నారు. కల్లాలలో నుండి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్న కొనుగోళ్లలో జాప్యం కొనుగోలు చేసిన ధాన్యం తరలింపులో జాప్యం జరిగిందన్నారు. మరోవైపు గన్ని బ్యాగుల కొరత వల్ల రైతులు గురవుతున్నారని వాపోయారు. ఒకవైపు వర్షాకాలం సమీపిస్తుండటంతో విత్తనాలు నాటే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే జొన్న పంటను తరలించాలని డిమాండ్ చేశారు.






