97 రోజులుగా రైతుల దీక్షలు
- అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
- ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల యత్నం
- 9న హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేద్దాం
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతి పాదన వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలపడానికి ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యం లో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమైందని ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి ప్రజలకు అండగా నిలవాలన్నా రు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి కాంగ్రె స్ నాయకులు గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ముందు కు తెచ్చారని అ న్నారు.
దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు 97 రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకోకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు.హరీశ్‌రావు పర్యటనతో రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్‌రావు పర్యటనకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.




